Vijay Rashmika Love Story:ఐస్‌క్రీం జ్ఞాపకాల నుంచి ప్రేమ వరకు – విజయ్ & రష్మిక స్టోరీ

Vijay Rashmika Love Story:టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట గురించి ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి స్నేహానికి బీజం పడింది ఒక చిన్న సంఘటనతోనే అన్న విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.

‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో మండుతున్న ఎండల్లో సెట్లో పనిచేసే సిబ్బందికి రష్మిక స్వంత ఖర్చుతో ఐస్‌క్రీమ్స్ తెప్పించిందట. ఆ సమయంలో అందరి ముఖాల్లో కనిపించిన ఆనందం విజయ్‌ను బాగా ప్రభావితం చేసిందని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం గుర్తుకొస్తోంది.

Salaar 2 Update – భారీ ప్లానింగ్ స్టార్ట్

ఆ సంఘటన తర్వాతే ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఐస్‌క్రీం ట్రక్కులు పంపించే సంప్రదాయం ప్రారంభించానని విజయ్ చెప్పాడు. చిన్న గుడ్‌విల్ జెస్టర్ ఎలా ఒక అందమైన బంధానికి దారి తీసిందో ఈ కథ చెబుతోంది. ప్రస్తుతం ఈ జంటపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఆ జ్ఞాపకాలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.

Tumbbad-2:తుంబాడ్ 2లో నవాజుద్దీన్ ఎంట్రీ అధికారికం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *