
Tumbbad-2:భారతీయ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘తుంబాడ్’ సీక్వెల్‌పై ఎట్టకేలకు కీలక అప్డేట్ వచ్చింది. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కాస్టింగ్‌తో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
మొదటి భాగం రీ-రిలీజ్ సమయంలోనే మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు నవాజుద్దీన్ లాంటి ఇంటెన్స్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వడం కథలో మరింత డెప్త్, డార్క్ టోన్ ఉంటుందని సూచిస్తోంది. నిర్మాత సోహుమ్ షా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈ వార్త కన్ఫర్మ్ అయింది.
ఈసారి కథ మరింత విస్తృతంగా, భయానక వాతావరణంతో తెరకెక్కనుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
