తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమా చివర్లో ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఎదురైంది. ఎండ్ టైటిల్స్ దగ్గర దగ్గుబాటి రానా చిన్న క్యామియో రోల్‌లో కనిపించారు. ఈ సీన్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సీన్ వెనుక అసలు ప్లాన్ ఏంటంటే – మిరాయ్ 2 లో రానా విలన్‌గా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడట.
ఇప్పటికే రానా దగ్గుబాటి ఏ రోల్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తూనే, వేరే తరహా పాత్రలకు కూడా ఓకే చెబుతాడు. బాహుబలి లో భల్లాలదేవగా, భీంలా నాయక్ లో డేనియల్ శంకర్‌గా అదరగొట్టాడు. అదే విధంగా ఇప్పుడు మిరాయ్ 2 లో మరోసారి నెగటివ్ రోల్‌తో సత్తా చాటాలని చూస్తున్నాడు.
అసలైన ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, మొదట రానా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో నటించాల్సి ఉందని టాక్ వచ్చింది. హనుమాన్ సినిమాలో లార్డ్ ఆంజనేయ పాత్రకు రానానే అని చాలా మంది భావించారు. కానీ ఆ రోల్ చివరికి రిషబ్ శెట్టి కి దక్కింది. అయితే రానా మాత్రం సడన్‌గా మిరాయ్ చివర్లో ఎంట్రీ ఇచ్చి తన తదుపరి విలన్ అవతారాన్ని కన్ఫామ్ చేశాడు.
మిరాయ్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తేజ సజ్జ నటనతో పాటు, రానా విలనిజం కూడా సినిమాకు పెద్ద బజ్ తీసుకురాబోతుందనే అంచనాలు ఉన్నాయి. నిర్మాతగా కూడా ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేస్తున్న రానా, హీరోగా విరాటపర్వం తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మిరాయ్ 2 తో మళ్లీ ఓ మాస్ ఇంపాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.