ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి – టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ29పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా లెవెల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే – రాజమౌళి ఈ సినిమాను ఎలాంటి పెద్ద ఎత్తున అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, నేరుగా షూటింగ్‌కి వెళ్లిపోయారు. సాధారణంగా జక్కన్న సినిమాలు సంవత్సరాల తరబడి పడతాయి. కానీ ఎస్ఎస్ఎంబీ29 మాత్రం అతి వేగంగా పూర్తవుతోందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే పలు షెడ్యూల్స్ ముగించిన యూనిట్, రీసెంట్‌గా కెన్యాలో కీలక యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌ని షూట్ చేసింది. కెన్యా షెడ్యూల్ ముగించుకొని తిరిగొచ్చిన టీమ్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించింది. ప్రత్యేకంగా వేసిన కాశీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ అక్టోబర్ 1 వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది.
ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తవనుంది. ఫస్ట్ హాఫ్‌లోని ముఖ్య సీన్స్ ఇక్కడే తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్‌లో ఎస్ఎస్ఎంబీ29 టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
జక్కన్న దర్శకత్వం – మహేష్ బాబు హీరోగా వస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై అన్ని వర్గాల్లోనూ భారీ హైప్ క్రియేట్ అవుతోంది.